అంతర్జాతీయ సినిమా వేడుకల్లో హాలీవుడ్ ముద్దుగుమ్మలు వింతవింత వస్త్రాలంకరణతో అంతలేసి అందాలతో మతులు పోగొట్టడం తెలిసిందే. ఆ పోకడ మన దగ్గర ఉన్నప్పటికీ మరీ ఆ రేంజ్ లో దేహసిరులు కనబరిచే ప్రయత్నం చేసినవారు లేరు. అందరికంటే ఓ అడుగు ముందుండాలనుకుందో ఏమో గానీ మిల్కీ బ్యూటీ తమన్నా ఆ పుణ్యకార్యం కాస్తా చేసేసింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన తమ్మూ బేబీ దారపు పోగుకెక్కువ ఉల్లిపొరకు తక్కువగా వున్న డిజైనర్ వేర్ లో అక్కడివారిని కాసేపు ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారిలో సినీ నటులతోపాటు ప్రజా ప్రతినిధులూ వున్నారు. వారందరి ముందు తమ్మూ చేసిన ర్యాంప్ వాక్ ఈ కార్యక్రమానికే వన్నె తెచ్చింది.read more
Unknown
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment