రైలు ప్రయాణం కోసం మీరు బుక్ చేసుకున్న రిజర్వేషన్ టికెట్ కన్ఫర్మ్ కాలేదా.. మరేం భయంలేదు. అదే రూట్‌లో ఆ రైలు తర్వాత ప్రయాణించే రైలులో మీ సీట్ సిద్ధంగా ఉంటుంది. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా.. మీరు రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే వెంటనే ఆ రూట్‌లో ప్రయాణించే మరో రైలుకు మీరు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఈ సరికొత్త ప్రయోగానికి రైల్వే సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మొదట పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ-లక్నో, ఢిల్లీ-జమ్ము మధ్య ప్రవేశపెట్టనున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ‘వికల్ప్’ పేరుతో ప్రవేశపెడుతున్న ఈ విధానం విజయవంతమైతే దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. అయితే మొదట ఈ విధానాన్ని ఇంటర్నెట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తింపజేయనున్నారు. అదికూడా మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనే దీనిని మొదట ప్రవేశపెట్టనున్నట్టు రైల్వే మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలియజేశారు. ఈ విధానానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన బట్టి టికెట్ బుకింగ్ కౌంటర్లలో కూడా అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఈ విధానంలో భాగంగా టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయాణికులు వారు వెళ్లాల్సిన రైలులో టికెట్ కన్ఫర్మ్ కాకుంటే అదే దారిలో ప్రయాణించే మరో ట్రైన్‌కు కన్ఫర్మేషన్ కోసం రిజర్వేషన్ ఫామ్‌లో ఆప్షన్ ఇస్తారు. అయితే ఆ రైలులో చార్జీ ఎక్కువైనా ప్రయాణికుల నుంచి మాత్రం అదనపు చార్జీ వసూలు చేయరు. అంతేకాక మరో రైలు వచ్చే వరకు ప్రత్యేకంగా వెయిటింగ్ రూమ్‌లు కూడా ఇచ్చేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ-లక్నో, ఢిల్లీ-జమ్ము రూట్లలో ఏడాది పొడవునా విపరీతమైన రద్దీ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Unknown
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment